Rashmika: కథ నచ్చితే కలిసి నటిస్తాం: రష్మిక

ప్రముఖ కథానాయిక రష్మిక విజయ్‌ దేవరకొండతో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Published : 02 Mar 2024 20:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ రష్మిక టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా రష్మిక టోక్యోలో జరగనున్న క్రంచీ అనిమే అవార్డు వేడుకకు హాజరయ్యేందుకు జపాన్‌ వెళ్లారు. ఈనేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్యూలో విజయ్‌ దేవరకొండతో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్మిక తెలిపారు. ‘‘అభిమానులు విజయ్‌, నేను కలిసి నటించే సినిమా కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. మేమిద్దరం స్క్రిప్ట్‌ కోసం చూస్తున్నాం. మంచి కథ కుదిరితే కచ్చితంగా కలిసి నటిస్తాం’’ అని రష్మిక వెల్లడించారు. 

‘గీత గోవిందం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక- విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’లోను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ జంటకు అభిమానులు, సినీప్రియుల్లో ఉన్న క్రేజ్‌ కారణంగా తరచూ సోషల్‌మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ‘రష్మిక భర్త వీడీలా ఉండాలి. ఆమెను ప్రొటెక్ట్‌ చెయ్యాలి. క్వీన్‌లాంటి ఆమెకు కింగ్‌ లాంటి భర్త రావాలి అని ఓ అభిమాని ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక అవును అది నిజమే అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారంటూ అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న  ‘పుష్ప: ది రూల్‌’ లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. విజయ్‌ ‘ఫ్మామిలీ స్టార్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని