Mission Majnu: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న రష్మిక చిత్రం

రష్మిక నటించిన బాలీవుడ్‌ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ‘మిషన్‌ మజ్ను’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది.

Published : 13 Dec 2022 15:06 IST

హైదరాబాద్‌: దక్షిణాదిలో దూసుకుపోతున్న రష్మిక (Rashmika Mandanna) బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మిషన్‌ మజ్ను’ (Mission Majnu). సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. షంతను బగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 20న నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌కానుంది. 1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు సిద్ధార్థ్‌. రోనీ స్క్రూవాలా, అమర్‌ బుటాలా, గరిమ మెహతా నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని