Updated : 06 Apr 2022 09:13 IST

Rashmika: వీరోచిత పాత్రలో రష్మిక

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై ఓ చిత్రం తెర   కెక్కుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాళిని ఠాకూర్‌ కథా  నాయిక. అశ్వినీదత్‌, ప్రియాంక దత్‌ నిర్మాతలు. వైజయంతీ మూవీస్‌ సమర్పిస్తోంది. తెలుగు, తమిళ,   మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం ఆ విషయాన్ని వెల్లడిస్తూ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అఫ్రీన్‌ అనే కశ్మీరీ  యువతిగా వీరోచిత పాత్రలో రష్మిక కనిపించనుంది. ‘‘మనసుల్ని హత్తుకునే రొమాంటిక్‌ కథలకి పెట్టింది పేరు హను రాఘవపూడి. అదే తరహా కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌... లెఫ్టినెంట్‌ రామ్‌ అనే పాత్రలో సందడి చేయనున్నారు. అతనికి జోడీగా సీత పాత్రలో మృణాళిని ఠాకూర్‌ నటిస్తోంది. రష్మిక మందన్న తరచూ చేసే పాత్రలకి భిన్నంగా ఇందులో కనిపించనుంద’’ని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: వైష్ణవిరెడ్డి.


విజయ్‌కి జోడీగా...

కొత్త అవకాశాల  విషయంలో దుమ్ము  రేపుతోంది రష్మిక మందన్న. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్‌ విజయ్‌ కథానాయకుడిగా  తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక కథానాయికగా ఎంపికైంది. ఆ విషయాన్ని మంగళవారం వెల్లడించింది చిత్రబృందం. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు - శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నారు.


 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని