Rashmika: నాపై నిషేధం విధించలేదు: రష్మిక
‘కాంతార’ సినిమా విషయంలో తాను ఎదుర్కొన్న ఆరోపణలపై రష్మిక స్పందించారు. తన వ్యక్తిగత వివరాలు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్: కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై నటి రష్మిక (rashmika mandanna) స్పందించారు. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టంచేశారు. ‘‘కాంతార’ (Kanatara) సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత’’ అని రష్మిక వివరించారు.
జరిగిందేంటంటే..?
కొన్ని రోజుల క్రితం.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌కు రష్మిక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ని పరంవా నిర్మించగా ‘కాంతార’ ఫేం రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. దాంతో, ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఎంతోమంది ప్రముఖులు ‘కాంతార’ను ప్రశంసించినా ఆమె ఏం మాట్లాడకపోవడానికి కారణం అదేనంటూ ఆరోపించారు. కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కొన్ని రోజుల క్రితం ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారడంతో తాజాగా స్పందించిన రష్మిక ఆ వార్తలకు చెక్ పెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
CCL: తుది సమరంలో ‘సీసీఎల్’.. విశాఖపట్నంలో తారల సందడి
-
Education News
APPSC Group4: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్ పరీక్ష తేదీ ఖరారు
-
Movies News
Rangamarthanda: అందుకే ‘రంగమార్తాండ’కు ప్రచారం చేయలేదు: కృష్ణవంశీ
-
Sports News
Rahul Dravid: ‘నేను స్పిన్ విభాగానికి కోచ్‌గా ఉంటానంటే ద్రవిడ్ వద్దన్నాడు’
-
India News
Rahul Gandhi: దేశం కోసమే నా పోరాటం.. ఎంత మూల్యానికైనా సిద్ధమే..!