Updated : 11 Jun 2022 07:53 IST

Rashmika: అయిదు నిమిషాల్లో తెలిసిపోయింది

బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకొన్న కన్నడ భామ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, రణ్‌బీర్‌ కపూర్‌ కలయికలో రూపొందుతున్న ‘యానిమల్‌’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ముంబయిలో ఈ షెడ్యూలు జరుగుతోంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘‘తొలి రోజు లుక్‌ టెస్ట్‌కు హాజరయ్యా. రణ్‌బీర్‌ ఎలా ఉంటాడో అని భయపడ్ఢా అయిదు నిమిషాల్లోనే తెలిసిపోయింది. అతను ఎంత సింపుల్‌గా ఉంటాడు. తనతో పని చేయడం చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత సన్నివేశాల చిత్రీకరణ బాగా సాగింది. పరిశ్రమలో నన్ను ‘మామ్‌’ అని పిలిచే ఏకైన వ్యక్తి రణ్‌బీర్‌’’ అని చెప్పుకొచ్చింది. ‘యానిమల్‌’ చిత్రంలో అనిల్‌కపూర్‌, బాబీడియల్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రష్మిక బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’, ‘మిషన్‌మజ్ను’ సినిమాలు చేస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని