Published : 16 May 2022 11:51 IST

Rashmika: పర్సనల్ లైఫ్‌పై రష్మిక ఆసక్తికర పోస్ట్‌

హైదరాబాద్‌: ‘‘నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నా లైఫ్‌ ఇలా ఉండేది’’ అని అంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఆమె తీరిక లేకుండా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్లికి హాజరు కావడం కోసం షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఫ్రెండ్‌ పెళ్లిలో తన లేడీ గ్యాంగ్‌తో కలిసి సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. పెళ్లి కుమార్తెతో కలిసి దిగిన పలు ఫొటోలను రష్మిక ఇన్‌ స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘‘ఈరోజు నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రాగిని పెళ్లి. ఈ రోజు తర్వాత ఆమెతో నేను ఫొటోలు దిగలేను. ప్రపంచం కోసం ఈరోజుని మిస్‌ చేసుకోవాలని అనుకోలేదు. తెల్లవారుజామున 4గంటలకు ఫ్లైట్‌ మిస్‌ కావడం, మరో ఫ్లైట్‌ కూడా 4, 5 సార్లు కాస్త ఆలస్యం కావడం.. ఇలా వరుస ఇబ్బందులతో వివాహానికి హాజరు కాలేనేమో అనుకున్నా. కానీ, దేవుడి దయ వల్ల ఎట్టకేలకు పెళ్లిలో పాల్గొన్నా. ఇక, ఈ గర్ల్‌ గ్యాంగ్‌లోనే నేను పెరిగాను. సుమారు 17 ఏళ్ల నుంచి నుంచి వీళ్లు నాకు తెలుసు. ఇప్పటికీ వీళ్లల్లో ఏమాత్రం మార్పు రాలేదు. నన్ను ఎంతో సంతోషంగా చూసుకున్నారు. వీళ్లందరూ నా వాళ్లు. ఈరోజు వీళ్లని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే.. నటిగా రష్మిక అనే యువతి మీకు పరిచయం కాకముందు ఇలా ఉండేది. ఇప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు’’ అని రష్మిక రాసుకొచ్చారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని