Rashmika Vijay Deverakonda: రష్మిక మాల్దీవుల టూర్ ఫొటోలు వైరల్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుష్
కెరీర్ ఆరంభంలోనే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్స్‌తో అలరించారు నటి రష్మిక - విజయ్ దేవరకొండ. ఆయా చిత్రాల్లో రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక షేర్ చేసిన మాల్దీవుల టూర్ ఫొటోలు ఇప్పుడు అంతటా వైరల్‌గా మారాయి.
హైదరాబాద్: ‘పుష్ప’(Pushpa)తో నటి రష్మిక (Rashmika) దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత ఆమెకు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు వరుస కట్టాయి. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా వర్క్ లైఫ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. సముద్రం, ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న ఆమె వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉంటోన్న హోటల్ రూమ్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చొన్న ఆమె ‘ఫ్లోటింగ్ ఫుడ్’ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వెకేషన్‌లో ఇటువంటి ఫొటోలు దిగడం సర్వసాధారణమే కదా ఇందులో వైరల్‌గా మారేంత కంటెంట్ ఏముంది అనుకుంటున్నారా..? అది నిజమే కానీ, ఈ ఫొటోలో ఆమె ఓ బ్రాండ్ న్యూ కూలింగ్ గ్లాసెస్ ధరించారు. వీటిని గమనించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు.. ‘‘ఈ కళ్లజోడు విజయ్ దేవరకొండది. ఆయన కళ్లజోడునే ఆమె పెట్టుకున్నారు. అంటే వీళ్లిద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారన్నమాట’’ అంటూ సోషల్‌మీడియా వేదికగా గుసగుసలాడుకుంటున్నారు.
మరికొంతమంది అభిమానులు.. ‘‘మేడమ్.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేయండి’’ అని కోరుతున్నారు. శుక్రవారం ఉదయం విజయ్ దేవరకొండ, రష్మిక ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు టూర్ వెళ్తున్నారంటూ వెబ్‌సైట్లలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారి, అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
wWBC: నిఖత్ జరీన్ పసిడి పంచ్..!
-
India News
Rahul Gandhi: ట్విటర్ బయోను మార్చిన రాహుల్
-
Politics News
Kishan Reddy: తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం: కిషన్ రెడ్డి
-
Movies News
ss karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్ రెడ్డి
-
World News
Planes Collide: తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి..!