Rashmika: ఐపీఎల్‌ @ రష్మిక లైవ్‌ డ్యాన్స్‌

ఐపీఎల్‌ ఆరంభం రోజున ఆడిపాడే నాయికల జాబితాలో దక్షిణాది అందం రష్మిక (rashmika) చేరింది. ఐపీఎల్‌ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకుంది. ‘మరపురాని సాయంత్రం కోసం  సిద్ధంగా ఉండండి.

Updated : 31 Mar 2023 07:09 IST

పీఎల్‌ ఆరంభం రోజున ఆడిపాడే నాయికల జాబితాలో దక్షిణాది అందం రష్మిక (Rashmika) చేరింది. ఐపీఎల్‌ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకుంది. ‘మరపురాని సాయంత్రం కోసం  సిద్ధంగా ఉండండి. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకలో రష్మిక ప్రదర్శ ఇవ్వనున్నారు’ అని వ్యాఖ్యలను జోడించారు. ‘రష్మిక మంచి నటే కాదు గొప్ప డ్యాన్సర్‌ కూడా. ఇప్పుడు మరోసారి లైవ్‌లో తన డ్యాన్స్‌తో వీక్షకులను అలరించనున్నారు’ అని రష్మిక ప్రదర్శన గురించి చెప్పారు. ఈ వేడుకలో తమన్నా కూడా ఆడిపాడనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు