Rashmika: రష్మిక.. హ్యాపీ హ్యాపీ

రష్మిక జోరు కొనసాగిస్తోంది. ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం  విజయ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.

Updated : 14 May 2022 12:34 IST

ష్మిక జోరు కొనసాగిస్తోంది. ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం  విజయ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పుడీ సెట్‌లోకి రష్మిక కాలు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.  ‘‘మేకప్‌ పూర్తి చేసుకొని షూట్‌కు సిద్ధంగా ఉన్నా. అప్పుడే సెట్లో నుంచి పిలుపొచ్చింది. లోపలికివెళ్లి విజయ్‌, వంశీతో పాటు ఇతర  చిత్ర బృందాన్ని కలిశాను. రోజంతా వారితో గడపడం చాలా బాగుంది. హ్యాపీ హ్యాపీ’’ అంటూ విజయ్‌తో సెట్లో తొలిరోజు అనుభవాలను ప్రత్యేకంగా పంచుకుంది రష్మిక. ఈ సినిమా చిత్రీకరణ మరికొన్ని వారాల పాటు హైదరాబాద్‌లోనే కొనసాగనుంది. విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రమిది. కొత్తదనం నిండిన కథాంశంతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా సినిమా ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని