Updated : 30 Jun 2021 10:22 IST

Rashmika: విజయ్‌తో ఉన్న రిలేషన్‌ బయటపెట్టిన భామ

రౌడీబాయ్‌తో దిగిన స్పెషల్‌ ఫొటో షేర్‌ చేసిన రష్మిక

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందనా జంటకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో వీళ్లిద్దరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి సినీ ప్రియులు మనసు పారేసుకున్నారు. విజయ్‌-రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలు రావడం.. వాళ్లిద్దరూ వాటిని సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. కాగా.. తాజాగా ఆమె అభిమానులతో ఇన్‌స్టాలో ముచ్చటించారు. విజయ్‌ దేవరకొండతో తనకున్న రిలేషన్‌ షిప్‌ గురించి స్పందించారు.

ఫిట్‌గా ఉండడం.. హావభావాలు పలికించడం.. ఈ రెండింటిలో ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏమిటి?

ఒక నటిగా రాణించాలంటే హావభావాలు పలికించడం లేదా ఫిట్‌గా ఉండడం కంటే ముఖ్యంగా మంచి మనస్సున్న మనిషై ఉండాలి.

మీరు ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తున్నారు?

ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే ఆ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సెట్‌లోనే ఉన్నాను.

అందరూ మిమ్మల్ని నేషనల్‌ క్రష్‌ అని అంటుంటారు.. దాని గురించి మీరు ఎలా ఫీలవుతున్నారు?

నేషనల్‌ క్రష్‌ అంటూ నన్ను అడ్రస్‌ చేయడం నాకెంతో నచ్చింది. ‘నేషనల్‌ క్రష్‌’ని నేను స్వాగతిస్తున్నాను.

మీకు ఎన్ని భాషలు వచ్చు?

నా మాతృభాష కన్నడ. సినిమాల్లో నటించడం వల్ల మొత్తం ఆరు భాషలు నేర్చుకున్నాను.

విజయ్‌ దేవరకొండతో దిగిన ఫొటోల్లో మీకు బాగా నచ్చిన పిక్‌?

‘డియర్‌ కామ్రేడ్‌’ సమయంలో విజయ్‌తో దిగిన ఫొటో ఇది. కొచ్చిలో జరిగిన ఆ సినిమా మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో తీసుకున్న ఈ ఫొటో నాకెంతో ఇష్టం.

మీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను ఏం చేయాలి?

మీరు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి.

మీరు ఎప్పుడూ ఇంత పాజిటివ్‌గా ఉండడానికి కారణమేమిటి?

నా తల్లిదండ్రులు, చెల్లి, ఫ్రెండ్స్, ముఖ్యంగా అభిమానులు.. వీళ్లందరి వల్లే నేను ఎంతో ఎనర్జిటిక్‌, పాజిటివ్‌గా ఉండగలుగుతున్నాను.

విజయ్‌ దేవరకొండ మీకు ఎంత స్పెషలో చెప్పగలరు?

విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. విజయే నా బెస్ట్‌ ఫ్రెండ్‌.

ఇప్పటివరకూ మీరు ఎన్నిసార్లు సిగరెట్‌ కాల్చారు?

నాకు ధూమపానం అంటే నచ్చదు. అలాగే ధూమపానం చేసేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.

అల్లు అర్జున్‌ గురించి ఏమైనా చెప్తారా?

అల్లు అర్జున్‌తో కలిసి నేను ‘పుష్ప’లో నటిస్తున్నాను. ఆయనతో కలిసి నటించడం ఎంతో బాగుంది. కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే వ్యక్తి. ఒక్కసారి క్యారెక్టర్‌లోకి అడుగుపెట్టగానే.. ప్రొఫెషనల్‌గా మారిపోతారు. ఆయన మంచి నటుడు, అద్భుతమైన డ్యాన్సర్‌. ఆయనతో వర్క్‌ చేయడాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నా.

మేడమ్‌.. ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసినప్పటికీ ‘ఇది మన వల్ల కాదు’ అనే ఒక నెగెటివ్‌ ఫీల్‌ వస్తుంది.. దాని నుంచి ఎలా బయటపడాలి?

ఎప్పుడూ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి... జీవితంలో ఏదీ అంత ఈజీగా రాదు. ఎల్లప్పుడూ మనల్ని మనం ప్రోత్సహించుకుంటూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి.

కోలీవుడ్‌ హీరో విజయ్‌ గురించి..? 

ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఒక అభిమానిగా ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను.

దేవుడు ఏదైనా వరమిస్తే ఏం కోరుకుంటారు?

భూమ్మీద ఉన్న మనుషుల జీవితాల్లోనుంచి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తీసేయమని కోరుకుంటాను.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని