
telugu movies:ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రావణ లంక’, ‘ఏకమ్’
ఇంటర్నెట్‌డెస్క్: గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన చిన్న చిత్రాలు ‘రావణలంక’, ‘ఏకమ్’. తాజాగా ఈ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్.ఎస్.రాజు దర్శకుడు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అప్పుడు మిగిలిన వాళ్లు ఏం చేశారు? అది హత్య? ఆత్మహత్య? తెలియాలంటే ‘రావణ లంక’ చూడాల్సిందే. ఉజ్జల కుమార్ సాహా స్వరాలు సమకూరుస్తున్నారు.
అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, అదితి మైఖేల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి, శ్వేతా వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకమ్’. అయిదు పాత్రల మధ్య జరిగే సంఘర్షణను దేవుడికి ముడిపెడుతూ దర్శకుడు వరుణ్ వంశీ ‘ఏకమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.