Ravanasura: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రావణాసుర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 28 Apr 2023 13:32 IST

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ రవితేజ (Raviteja) అభిమానులను ఆకట్టుకున్న సినిమా ‘రావణాసుర’ (Ravanasura). సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక నెగెటివ్‌ పాత్రలో రవితేజ తన నటనతో ఆదరగొట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం.. ప్రకటన లేకుండా సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ అమెజాన్‌ ఈ సినిమాను డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించారు.

క‌థేంటంటే..
ర‌వీంద్ర అలియాస్ ర‌వి (ర‌వితేజ) ఓ జూనియ‌ర్ లాయ‌ర్‌. క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న క‌న‌క మహాల‌క్ష్మి (ఫ‌రియా అబ్దుల్లా) దగ్గర ప‌నిచేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్‌) త‌న తండ్రిపై ప‌డిన ఓ హ‌త్య కేసుని వాదించాల‌ని కోరేందుకు క‌న‌క మ‌హాల‌క్ష్మి దగ్గరికి వ‌స్తుంది. ఆమె అంగీకరించనని చెబుతుంది. కానీ, చూడ‌గానే ఆమె అందానికి ఫిదా అయిన ర‌వి... ఎలాగైనా క‌న‌క మహాల‌క్ష్మిని ఒప్పిస్తాన‌ని హారికకి మాట ఇచ్చి రంగంలోకి దిగుతాడు. ఆ కేసు ఒప్పుకొన్నాక ఏం జ‌రిగింది? ఈ కేసుని ఎవ‌రు గెలిచారు? ఇంత‌కీ ఆ హ‌త్య చేసిందెవ‌రనేది తెలియాలంటే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని