Raveena Tandon: ఫేక్‌ పోస్ట్‌.. రూ.100కోట్లు పరువు నష్టం దావా వేసిన నటి

తనపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేసిన వ్యక్తిపై రవీనా పరువు నష్టం దావా వేశారు.

Updated : 15 Jun 2024 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు సంబంధించిన ఫేక్‌ వీడియో పోస్ట్‌ చేసినందుకు నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీ కొట్టిందని.. వారు గాయపడినట్టు కొందరు పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తి.. ఆ సమయంలో రవీనా మద్యం తాగి ఉన్నారని రాసుకొచ్చారు. ఆ మహిళలతో ఆమె గొడవకు దిగినట్లు పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు.

వాళ్ల స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్‌ అశ్విన్‌

రవీనా తరఫు న్యాయవాది సనా ఖాన్‌ ఈ విషయంపై మాట్లాడుతూ..‘ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగానే రవీనా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఆమె పేరును ఉపయోగించుకొని కొందరు పబ్లిసిటీ పొందాలని చూస్తున్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు స్పందించారు. రవీనా, ఆమె డ్రైవర్‌ ఎవరూ మద్యం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రవీనా ఆ వ్యక్తిపై దావా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని