Raveena Tandon: సూపర్‌హిట్‌ రెయిన్‌ సాంగ్‌.. అక్షయ్‌ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్‌

‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ పాట షూట్‌ అప్పుడు తాను ఎన్నో షరతులు పెట్టినట్టు తాజాగా రవీనా టాండన్‌ (Raveena Tandon) వెల్లడించారు. 

Updated : 14 Sep 2023 16:19 IST

ముంబయి: సూపర్‌హిట్‌ అందుకున్న బాలీవుడ్‌ రెయిన్‌ పాటల్లో ఒకటి ‘టిప్‌ టిప్‌ బర్‌సా పానీ’ (Tip Tip Barsa Paani). ‘మోహ్ర’ (Mohra) సినిమాలోని ఈ పాటకు అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), రవీనా టాండన్‌ (Raveena Tandon) చేసిన డ్యాన్స్‌ను సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. పసుపు రంగు చీరలో రవీనా వానలో తడుస్తూ అందాలను ఒలకబోస్తుంటే, ఆ వయ్యారాలు చూసి యువత మనసు పారేసుకున్నారు. అయితే, ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల రవీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ పాట షూట్‌ అప్పుడు తాను ఎన్నో షరతులు పెట్టానని ఆమె చెప్పారు.

‘‘పాటలో నా చీర జారినట్టు చూపించకూడదు. హీరోతో నాకు ముద్దు సన్నివేశాలు ఉండకూడదు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటూ చాలా షరతులు పెట్టాను. ఇలా ఎన్నో కండిషన్స్‌ తర్వాత చివరకు ఆ పాట మీరు చూస్తున్న విధంగా రూపుదిద్దుకుంది. నటీనటుల మధ్య ఉన్న కెమిస్ట్రీని ఇబ్బందికరంగా ఎక్కడా చూపించలేదు. సాన్నిహిత్యాన్ని చూపించడంలోనూ హద్దులు దాటకుండా ప్రేక్షకులను ఆకర్షించే విధంగా రూపొందించారు’’ అని ఆమె వెల్లడించారు.

‘మోహ్ర’ సినిమా తర్వాత అక్షయ్‌ - రవీనా కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఇదే విషయంపై మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగత కారణాలతో మేము పెళ్లి వరకూ వెళ్లలేదు. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు చూసుకున్నాం. అయినప్పటికీ అక్షయ్‌ నాకు మంచి స్నేహితుడు. నేను అతడిని గౌరవిస్తున్నాను. అలాగే, మన ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో అతడు కూడా ఒకరు’’ అని ఆమె వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు