Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్ (Raveena Tandon) తన కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. తన సహ నటుడి పెదవులు తాకగానే వాంతి అయినట్లు చెప్పారు.

Updated : 29 Sep 2023 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘కేజీఎఫ్‌-2’లో రమికా సేన్‌గా ప్రేక్షకులను మెప్పించారు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon). మంచి సినిమాల్లో నటించి స్టార్‌గా ఎదిగిన ఆమె గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఓ సన్నివేశంలో నటించాక ఆమె వాంతి చేసుకున్నట్లు వెల్లడించారు. సహనటుడి పెదవులు తాకగానే వాంతి వచ్చినట్లు చెప్పారు.

ఇండస్ట్రీలో నో కిస్సింగ్‌ రూల్‌ను పాటిస్తున్న హీరోయిన్స్‌లో రవీనా టాండన్‌ ఒకరు. దీనిపై ఆమె మాట్లాడుతూ..‘‘ఆ రోజుల్లో కాంట్రాక్టులాంటివి ఏవీ లేవు. అయినా నేను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. అలాంటి వాటిల్లో నటిస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓసన్నివేశంలో నా సహనటుడి పెదవులు పొరపాటున నా పెదవులకు తగిలాయి. ఇది అతడు కావాలని చేయలేదు అనుకోకుండానే జరిగింది. దీంతో నాకు అసౌకర్యంగా అనిపించింది. వెంటనే నా రూమ్‌లోకి వెళ్లాను. ఎంతో వికారంగా అనిపించి వాంతి అయింది. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది’’ అని తెలిపారు. అయితే, ఇది ఏ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగింది. హీరో ఎవరు అనేది మాత్రం రవీనా టాండన్‌ వెల్లడించలేదు. ఆ సంఘటన తర్వాత ఆ హీరో క్షమాపణలు చెప్పినట్లు రవీనా తెలిపారు. 

ధోనీ సతీమణి నిర్మించిన ‘ఎల్‌జీఎం’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

 రవీనా ఒక పాపను పెంచుతున్నారు. ఆమె కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తనకు కూడా ఇలానే నో కిస్సింగ్‌ రూల్‌ పాటించమని చెబుతారా? అనే ప్రశ్నకు రవీనా సమాధానం చెబుతూ..‘ఆ విషయంలో ఆమెకు పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఆమెకు అభ్యంతరం లేకపోతే నటించవచ్చు. ఆమెకు ఇష్టం లేకపోతే బలవంతం పెట్టే అధికారం ఎవరికీ ఉండదు కదా’ అని రవీనా అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని