Ravi Teja: ఓవర్‌ చేయకు: డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌తో రవితేజ

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పెట్టిన ఓ పోస్ట్‌పై స్పందించిన రవితేజ ‘ఓవర్‌ చేయకు’ అని రిప్లై ఇచ్చారు. ఎందుకంటే?

Updated : 23 Jun 2024 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు హీరో రవితేజ (Ravi Teja). ‘నీ దిష్టే తగిలేలా ఉంది’ అని దర్శకుడి పోస్ట్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan). చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోను డైరెక్టర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. రవితేజ అందులో స్టైలిష్‌గా కనిపించారు. దాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప!!’’ అని హరీశ్‌ కామెంట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన రవితేజ తనదైన శైలిలో ఓవర్‌ చేయకు అని సమాధానమిచ్చి.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ‘ఇదీ టైమింగ్‌ అంటే’ అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఇదే జోష్‌లో రిలీజ్‌ డేట్‌ చెప్పండని కోరుతున్నారు.

కమల్‌ స్థానంలో మోహన్‌లాల్‌.. షారుక్‌ ప్లేస్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌

రవితేజకు అభిమాని అయిన హరీశ్‌ గతంలో ఆయనతో ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. తాజా చిత్రంలో ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నారు రవితేజ. నిజాయతీ గల ఆ ఆఫీసర్‌.. ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందనే అంశంతో సినిమా రూపొందించినట్టు సమాచారం. ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ‘షో రీల్స్‌’ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని