ఏప్రిల్ 12న 'ఖిలాడి' టీజర్  విడుదల  

‘క్రాక్‌’ సినిమా విజయంతో దూకుడు మీదున్న మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి.

Published : 09 Apr 2021 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘క్రాక్‌’ సినిమా విజయంతో దూకుడు మీదున్న మాస్‌ హీరో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  సమకూరుస్తున్నారు. తన 67వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని ఏప్రిల్‌ 12న విడుదల చేస్తున్నట్లు రవితేజ తన ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. అర్జున్, ఉన్ని ముకుందన్, నికితిన్ ధీర్, సచిన్ ఖేడెకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, ఠాకూర్ అనూప్ సింగ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రాబోయే ఈ  టీజర్ మరింతగా అభిమానులను ఆకట్టుకోనుందని చిత్రబృందం ఆశిస్తోంది. సినిమాకి సుజిత్ వాసుదేవ్, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫర్లు‌గా పనిచేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెత్స నిర్మాతలు. మే 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో రవితేజ.. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ‘వీర’ అనే చిత్రం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని