Dhamaka: రవితేజ ‘ధమాకా’ ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ అప్పుడే

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురువారం ఖరారైంది.

Published : 13 Jan 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Ravi Teja) తాజా చిత్రం ‘ధమాకా’ (Dhamaka) ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘అందరికీ మంచి కిక్‌ ఇచ్చే శుభవార్త. ధమాకా త్వరలోనే’’ అని సదరు సంస్థ గురువారం ప్రకటిస్తూ సినిమా స్టిల్‌ను పంచుకుంది. జనవరి 22 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నా.. అధికారిక ప్రకటనతో సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. గతేడాది డిసెంబరు 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్లకుగా వసూళ్లు (గ్రాస్‌) సాధించిన సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ యాక్షన్‌ కామెడీ చిత్రంలోని కథానాయిక అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

క‌థేంటంటే? పీపుల్ మార్ట్ అధిప‌తి అయిన చ‌క్ర‌వ‌ర్తి (స‌చిన్ ఖేడేక‌ర్‌) త‌న‌యుడు ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తి (ర‌వితేజ‌). చ‌క్ర‌వ‌ర్తి మ‌రో రెండు నెల‌ల్లో చ‌నిపోతున్నాడ‌ని తెలుసుకున్న ‘జేపీ ఆర్బిట్’ అధిప‌తి జేపీ (జ‌య‌రాం) పీపుల్ మార్ట్ కంపెనీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నుకుంటాడు. అందుకు అడ్డుగా ఉన్న ఆనంద్‌ని అంతం చేయాల‌నుకుంటాడు. జేపీలాంటి వ్య‌క్తుల‌కి బుద్ధి చెప్ప‌డానికి స్వామి (ర‌వితేజ‌)నే స‌రైనోడని భావించిన చ‌క్ర‌వ‌ర్తి అతణ్ని రంగంలోకి దింపుతాడు. ఇంత‌కీ స్వామి ఎవ‌రు? అత‌నికీ చ‌క్ర‌వ‌ర్తికీ సంబంధం ఏమిటి? స్వామి, ఆనంద్ ఒకలా ఉండ‌టానికి కార‌ణం ఏమిటి? ఇద్ద‌రూ ఒక్క‌రే అనుకుని ఇద్ద‌రినీ ప్రేమించిన ప్ర‌ణ‌వి (శ్రీలీల‌) ఎలాంటి పాట్లు పడిందనేది మిగ‌తా క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని