Mr Bachchan Song: చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా.. బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా

‘మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని అలరించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.

Published : 11 Jul 2024 01:46 IST

మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని అలరించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా బుధవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా.. బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా’’ అంటూ సాగిన ఈ మెలొడీ గీతానికి మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూర్చగా.. సాహితీ సాహిత్యమందించారు. సాకేత్‌ కొమండూరి, సమీర భరద్వాజ్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ జంటగా కనిపించిన తీరు.. శేఖర్‌ మాస్టర్‌ తీర్చిదిద్దిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి కూర్పు: ఉజ్వల్‌ కులకర్ణి, ఛాయాగ్రహణం: అయనంక బోస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని