Raviteja: ‘ధమాకా’ రిలీజ్‌.. మాస్‌ని మెప్పించేలా రవితేజ రిప్లైలు

రవితేజ నటించిన సరికొత్త చిత్రం ‘ధమాకా’. త్రినాథ్‌రావు నక్కిన దర్శకుడు. శ్రీలీల కథానాయిక. క్రిస్మస్‌ కానుకగా ఇది రానుంది. 

Published : 09 Dec 2022 13:53 IST

హైదరాబాద్‌: ‘క్రాక్‌’తో (Krack) తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నటుడు రవితేజ (Raviteja). ప్రస్తుతం అతడి నుంచి వస్తోన్న సరికొత్త చిత్రం ‘ధమాకా’ (Dhamaka). మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ శుక్రవారం ఉదయం అభిమానులతో ట్విటర్‌ వేదికగా ముచ్చటించాడు. #AskRaviteja సెషన్‌లో పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాస్‌ని ఆకట్టుకునేలా రిప్లైలు ఇచ్చాడు.

కేవలం ‘ధమాకా’ విశేషాలపైనే సాగిన ఈ చాట్‌లో.. ‘‘ధమాకా’తో డిసెంబర్‌ 23న థియేటర్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని, ఈసినిమా కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని, కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఇక, ‘జింతాక’ పాటను తాను ఎంజాయ్‌ చేస్తున్నానని ఈ సారి హిట్‌ గ్యారెంటీ అని చెప్పారు. శ్రీలీల మంచి టాలెంట్‌ ఉన్న నటి అని వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు