
Raviteja Khiladi: రూమర్స్‌కి చెక్
హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఖిలాడి’పై వస్తోన్న పుకార్లకు చిత్ర నిర్మాత చెక్ పెట్టారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందంతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు.
‘‘ఖిలాడి’ విడుదల గురించి వస్తోన్న వార్తలను దయచేసి ఎవరూ నమ్మకండి. మా ఈ సినిమా అనుభవాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లోనే పొందాలి. దానికి అనుగుణంగానే చిత్రీకరణ విషయంలో మేము ఎక్కడా రాజీపడడం లేదు. ప్రేక్షకులందర్నీ ఆకర్షించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి రమేష్ వర్మ శ్రమిస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ చక్కగా పూర్తయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నలుగురు ఫైట్ డైరెక్టర్లు ఈ చిత్రానికి మరోబలం. కొన్నిరోజుల తర్వాత పాటల్ని సైతం రిలీజ్ చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రవితేజ ఎంతో ఎనర్జీటిక్గా కనిపించనున్నారు. ప్రముఖ నటుడు అర్జున్, ఉన్నికృష్ణన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి, అనసూయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పెన్ మూవీస్ పతాకంపై సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా
-
Politics News
BJP: భాజపా పదాధికారుల సమావేశాలను ప్రారంభించిన నడ్డా
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
-
India News
Spicejet: క్యాబిన్లో పొగలు.. స్పైస్‌జెట్ విమానం వెనక్కి
-
Sports News
Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య