RaviTeja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ వాయిదా.. ఎందుకంటే?

ప్రభుత్వాధికారిగా రవితేజ నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. జూన్‌ 17న విడుదలకావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.

Published : 26 May 2022 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వాధికారిగా రవితేజ (Raviteja) నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty). శరత్‌ మండవ దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. జూన్‌ 17న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. అద్భుతమైన, మాస్‌ ఔట్‌పుట్‌ ఇచ్చేందుకు పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను మరింత జాగ్రత్తగా చేస్తున్నామని, దానికి సమయం సరిపోకపోవడంతో సినిమాను వాయిదాను వేయాల్సి వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ సరసన రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ సందడి చేయనున్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌, కూర్పు: ప్రవీణ్‌ కెఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని