Ravanasura: చిరంజీవి అతిథిగా.. రవితేజ ‘రావణాసుర’ షురూ!

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. హీరోస్‌ డోన్ట్‌ ఎగ్జిస్ట్‌ అనేది ఉపశీర్షిక.

Published : 14 Jan 2022 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. హీరోస్‌ డోన్ట్‌ ఎగ్జిస్ట్‌ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా.. ప్రముఖ నటుడు చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథులుగా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి క్లాప్‌కొట్టగా తలసాని కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమా స్కిప్టును చిత్ర బృందానికి అందజేశారు. దర్శకులు గోపీచంద్‌ మలినేని, కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. కథానాయికలు ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కార్‌, మేఘా ఆకాశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

రవితేజ నటిస్తున్న 70వ చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. 2022 సెప్టెంబరు 30న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని