Ravi Teja: ఆయన కథ చెప్పినప్పుడు నవ్వాగలేదు.. నాకూ నటించాలనుంది: రవితేజ
విష్ణు విశాల్ హీరోగా రవితేజ నిర్మించిన చిత్రం ‘మట్టికుస్తీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్: ‘మట్టికుస్తీ’ (Matti Kusthi) దర్శకుడు చెల్లా అయ్యావు తనకు కథ చెప్పినప్పుడు విపరీతంగా నవ్వానని అన్నారు ప్రముఖ నటుడు రవితేజ (Ravi Teja). తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా రవితేజ నిర్మించిన చిత్రమిది. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ అతిథిగా హాజరయ్యారు.
వేడుకనుద్దేశించి రవితేజ మాట్లాడుతూ.. ‘‘విష్ణు విశాల్ పాజిటివ్ వ్యక్తి. తొలి పరిచయంలోనే ‘ఇతను నాకు ఎప్పటి నుంచో తెలుసు’ అనే ఫీలింగ్ నాకు కలిగింది. కలిసి సినిమా చేయాలనుకున్నామో లేదో వెంటనే అన్ని పనులూ కుదిరాయి. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. దర్శకుడు చెల్లా కథ చెప్పినప్పుడు నవ్వాగలేదు. అంత ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ ఉన్న వ్యక్తి. అతని దర్శకత్వంలో నాకూ నటించాలనుంది. ‘మట్టికుస్తీ’ చిత్రం చాలా బాగా వచ్చింది. మీరంతా ఆనందిస్తారనే నమ్మకం ఉంది. స్పోర్ట్స్ నేపథ్యమున్న సినిమా అయినా ఇందులో లవ్, కామెడీ.. ఇలా అన్ని హంగులున్నాయి. నన్ను హీరోగా ఎంతగా ఆదరించారో నిర్మాతగా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని రవితేజ అన్నారు. ‘‘రవితేజ నటనను నేను ఇష్టపడతా. మంచి మనసున్న వ్యక్తి తను. ఫస్ట్ మీటింగ్‌లోనే నన్ను నమ్మారు. కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, తెలుగు చిత్రాల్లో నటించాలని జ్వాల నన్ను ప్రోత్సహించింది’’ అని విష్ణు విశాల్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన
-
Politics News
Perni Nani: ‘జగన్ పిచ్చి మారాజు’
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..