Khiladi: ఇష్టమైన ఖిలాడీ పాట వచ్చేసింది..

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకుడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద అంటే ఇష్టం.....

Updated : 07 Dec 2022 15:53 IST

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకుడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద అంటే ఇష్టం. కొంచెం ఎదిగినాక బామ్మ గోరింటాకు ఇష్టం.. కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం. అది నాకోసం నువ్వు పడే కష్టం’ అంటూ సాగే లిరికల్‌ పాట ఆకట్టుకునేలా సాగుతోంది. శ్రీమణి లిరిక్స్ అందించగా హరిప్రియ ఆలపించారు.

‘క్రాక్‌’ విజయం తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రమిదే. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరీ కథానాయికలు. ఇందులో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు అర్జున్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని