Raviteja Khiladi Review: రివ్యూ: ఖిలాడి
రవితేజ నటించిన ఖిలాడి ఎలా ఉందంటే..?
చిత్రం: ఖిలాడి; నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, అర్జున్, అనసూయ, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్, తదితరులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు; దర్శకత్వం: రమేశ్ వర్మ; నిర్మాత: కోనేరు సత్యనారాయణ; విడుదల తేదీ: 11-02-2022
కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి అంతగా కనిపించలేదు. గత మూడు వారాల్లో అడపాదడపా ఒకటి రెండు చిన్న చిత్రాలు థియేటర్ ముందుకొచ్చినా.. వాటిల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ క్రమంగా కుదుటపడుతుండటంతో.. మళ్లీ చిత్రసీమలో వినోదాల సందడి మొదలైంది. అగ్రతారల సినిమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అలా ఈ వారం రవితేజ ‘ఖిలాడి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడం, దానికి తోడు ‘రాక్షసుడు’ లాంటి విజయం తర్వాత రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రవితేజ, రమేశ్ వర్మ ఖాతాలో మరో విజయం చేరిందా? ఇంతకీ ఈ కథేంటి? తెలుసుకుందాం పదండి.
కథేంటంటే: పూజా(మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. చాలా తెలివైన అమ్మాయి. క్రిమినల్ సైకాలజీ చదువుతుంటుంది. ఓ థీసెస్ కోసం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ(రవితేజ)ని కలుస్తుంది. హోం మంత్రి గురుసింగం(ముఖేష్ రుషి) రూ.10వేల కోట్లకు సంబంధించిన లావాదేవి వల్ల తానెలా సమస్యల్లో చిక్కుకున్నది, కుటుంబాన్ని పోగొట్టుకుని చేయని నేరానికి జైలుకు ఎలా రావాల్సి వచ్చింది.. ఓ కట్టుకథలా ఆమెకు చెప్తాడు. ఆ కథ నిజమని నమ్మిన పూజా.. మోహన్‌గాంధీకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ అతనికి బెయిల్ వచ్చేలా చేస్తుంది. సరిగ్గా గాంధీ బయటకు రాగానే అతడి జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం తెలుస్తుంది. అతడు ఓ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి డబ్బు కొట్టేయడానికే ఇటలీ నుంచి భారత్‌కు వచ్చాడని, ఇందుకోసం తెలివిగా తనని వాడుకున్నాడని పూజాకు అర్థమవుతుంది. మరి ఆ డబ్బు ఎవరిది? అదెక్కడ దాచారు? ఆ డబ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశపడిన గురుసింగం కోరిక తీరిందా?డబ్బును కొట్టేయాలన్న గాంధీ కోరిక నెరవేరిందా? డబ్బుతో పాటు గాంధీని పట్టుకోవాలన్న సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ (అర్జున్) లక్ష్యం నెరవేరిందా? ఈ మొత్తం కథలో డింపుల్, అనసూయ, ఉన్ని ముకుందన్, మురళీ శర్మల పాత్రలేంటి?అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా సాగిందంటే: రూ. 10 వేల కోట్ల డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. దీన్ని విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరపై వడ్డించే ప్రయత్నం చేశారు దర్శకుడు రమేశ్ వర్మ. ఓ తెలివిమీరిన దొంగ.. రూ.10 వేల కోట్ల టార్గెట్.. ఆ డబ్బు కోసమే కాచుకు కూర్చొన్న రెండు ముఠాలు.. ఆ డబ్బును, దొంగల్ని పట్టుకు తీరాలనే లక్ష్యంతో తిరిగే సీబీఐ అధికారి.. ఇవన్నీ చూస్తుంటే ఓ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన సరుకంతా ఈ కథలో ఉన్నట్లు అర్థమవుతుంది. నిజానికి ఈ దినుసుల్ని సరిగ్గా సమగ్రంగా ఉపయోగించుకుని ఉంటే.. ఓ పసందైన థ్రిల్లర్ తయారై ఉండేది. కానీ, వీటన్నింటినీ సరైన రీతిలో మేళవించి.. ఆసక్తికరంగా సినిమాని మలచడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ఈ కథను చెప్పడానికి ఆయన ఎంచుకున్న ఎత్తుగడే పేలవంగా అనిపిస్తుంది. భార్యని, అత్తమామల్ని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా రవితేజ పాత్రని పరిచయం చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. పూజాకు అతడు తన కథ చెప్పడం ప్రారంభించాక థ్రిల్లర్ సినిమా కాస్తా.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. రవితేజ, డింపుల్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. నిజానికి సినిమా అసలు కథ ఇది కాబట్టి ఈ ఎపిసోడ్‌పై దర్శకుడు అంత దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. అయితే పాటల్లో డింపుల్ ఒలికించిన అందాలు కుర్రకారుకు కాస్త కాలక్షేపాన్నిస్తాయి. గురుసింగానికి సంబంధించిన రూ.10వేల కోట్లను డేవిడ్ ముఠా కొట్టేయడం.. ఈ క్రమంలో వచ్చే ఛేజింగ్ ఎపిసోడ్లతో కథలో కాస్త వేగం పెరుగుతుంది. విరామానికి ముందు మోహన్ గాంధీ పాత్ర అసలు కథను రివీల్ చేయడం.. ఈ సందర్భంగా అర్జున్, గాంధీ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయి.
ద్వితీయార్ధం నుంచి సినిమా పూర్తిగా థ్రిల్లర్ ట్రాక్ ఎక్కినట్లు కనిపించినా.. కాసేపటికే కథ మొత్తం రొటీన్ వ్యవహారంలా మారిపోతుంది. రూ.10 వేల కోట్లు కొట్టేయడం కోసం మోహన్‌గాంధీ ముఠా చేసే ప్రయత్నాలు చాలా వరకు సిల్లీగా ఉంటాయి. అయితే మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు కాస్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. థ్రిల్లర్ కథలకు ముగింపు చాలా కీలకం. కానీ, ఈ సినిమా విషయంలో అదే పెద్ద మైనస్. ఊహకందని మలుపులు.. విపరీతమైన ట్విస్ట్‌లు.. రుచి చూపించాలన్న తాపత్రయంలో దర్శకుడు కథని సాగదీసే ప్రయత్నం చేశారు. వాటిలో చాలా వరకూ ఊహలకు తగ్గట్లుగా సాగడం.. లెంగ్తీగా ఉండటంతో క్లైమాక్స్ విసుగు పుట్టించేలా మారిపోయింది. అయితే పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: మోహన్ గాంధీ పాత్రలోని రెండు షేడ్స్‌ను రవితేజ అద్భుతంగా పండించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. డింపుల్ హయాతి అభినయంతో కన్నా.. అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పాటల్లో ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు ఒలికించింది. మీనాక్షి చౌదరి కూడా తన సొగసులతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నటన పరంగా ప్రతిభ చూపించేందుకు ఆమెకి కూడా పెద్ద అవకాశం రాలేదు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రల్లోనూ రెండు షేడ్స్ కనిపిస్తాయి. కానీ, ప్రతి పాత్ర రొటీన్‌గానే అనిపిస్తుంది. నికితిన్ ధీర్, ఉన్ని ముకుందన్, ముఖేష్, అర్జున్, రావు రమేష్‌ల పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. స్ర్కిప్ట్ విషయంలో రమేశ్ మరింత కసరత్తు చేయాల్సింది. ద్వితీయార్ధంలో మలుపులు ఉన్నా.. ప్రతి ఎపిసోడ్ సాగతీత వ్యవహారమైపోయింది. రెండు మూడు పాటల్లో దేవిశ్రీప్రసాద్ మార్క్ కనిపించినా.. నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో ఉండదు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది.
బలాలు:
+ రవితేజ నటన
+ డింపుల్, మీనాక్షి అందాలు
+ యాక్షన్ సీక్వెన్స్
బలహీనతలు
- ఊహకు తగ్గట్లుగా సాగే కథ
- సాగతీత సన్నివేశాలు
- క్లైమాక్స్
చివరిగా: అక్కడక్కడా మెప్పించే ‘ఖిలాడి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు