Ramcharan: రంగంలోకి రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ నాయిక. అంజలి, శ్రీకాంత్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ జులై తొలి వారం నుంచి అమృత్‌సర్‌లో ప్రారంభం కానుంది.

Updated : 29 Jun 2022 09:49 IST

రామ్‌చరణ్‌ (RamCharan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు (Dilarju), శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ (Kiara Advani) నాయిక. అంజలి, శ్రీకాంత్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ జులై తొలి వారం నుంచి అమృత్‌సర్‌లో ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర బృందం జులై 1న అక్కడికి బయలు దేరనున్నట్లు తెలిసింది. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో.. ఒక ఫైట్‌, పాటతో పాటు పలు కీలక సన్నివేశాలు తెర కెక్కించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. విభిన్నమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. ఇందులో చరణ్‌ మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరు, ఆర్‌.రత్నవేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని