Published : 31/03/2021 01:05 IST

కొత్త చిత్రాలు.. సర్‌ప్రైజ్‌లు  

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలకు సంబంధించి ఆయా చిత్ర బృందాలు సర్‌ప్రైజ్‌ని ఇవ్వనున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాయి. అవేంటో చూసేయండి..

* ‘రిపబ్లిక్‌’ చిత్ర టీజర్‌ ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. 

* స్వీయ దర్శకత్వంలో మాధవన్‌ నటిస్తోన్న చిత్రం ‘రాకెట్రీ’. ఏప్రిల్‌ 1న సాయంత్రం గం.5నిలకు ట్రైలర్‌ రానుంది.

* విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కుప్పిలి దర్శకుడు. ఈ సినిమాలోని ‘సరదాగా కాసేపైనా’ అనే పాటని ఏప్రిల్‌ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

* ధనుష్‌ తాజా చిత్రం ‘కర్ణన్‌’ నుంచి నాలుగో పాట మార్చి 31న విడుదలకాబోతుంది. ‘మారి’ సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఇది.
 





Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని