Cinema News: నిజ జీవిత ఘటనలతో...

రాగిణి ద్వివేది, మేఘనరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. మహేష్‌ దర్శకత్వం వహించగా,  సి.పుట్టస్వామి నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది.

Updated : 29 Jan 2022 07:05 IST

రాగిణి ద్వివేది, మేఘనరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. మహేష్‌ దర్శకత్వం వహించగా,  సి.పుట్టస్వామి నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘మహిళలు వాళ్లపై జరిగే ఆకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ సినిమా. ట్రైలర్‌ చూశాక ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’, ‘మౌనపోరాటం’ సినిమాలు గుర్తుకొచ్చాయి. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. రాగిణి ద్వివేది మాట్లాడుతూ ‘‘ఒక సవాల్‌గా తీసుకుని చేసిన సినిమా ఇది. దర్శకుడు నిజ జీవిత ఘటనలతో సహజంగా తెరకెక్కించారు. తెలుగులో విడుదలవుతున్న నా తొలి యాక్షన్‌ సినిమా ఇదే. తెలుగులో మరో పెద్ద చిత్రంలో నటించా’’ అన్నారు. ‘‘ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాల్ని చూపిస్తూ, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పే కథతో ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ప్రతి మహిళ చూడాల్సిన ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాల’’న్నారు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మాలోవత్‌ పూర్ణ. వంచనకి గురైన ఐదుగురు అమ్మాయిల కథతో, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలకి అద్దం పట్టేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. కార్యక్రమంలో సురేష్‌ కొండేటి, మహేష్‌ బంజారా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మానస, శేఖర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని