‘నువ్వే.. నువ్వే...’ 93 సెకన్స్‌ ట్రీట్‌

రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్‌’చిత్రంలోని మరో వీడియో సాంగ్‌ బిట్‌ను మంగళవారం విడుదల చేశారు. నువే..నువే అంటూ సాగే మెలోడియస్‌ విజువల్‌ ట్రీట్‌ 

Published : 11 Jan 2021 19:37 IST

హైదరాబాద్‌: రామ్‌ హీరోగా నటిస్తున్న ‘రెడ్‌’లోని మరో వీడియో సాంగ్‌ బిట్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘నువ్వే.. నువ్వే...’ అంటూ సాగే పాటలో రామ్‌తో కలిసి మాళవికా శర్మ సందడి చేశారు. మణిశర్మ స్వరాలు అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా గీతాన్ని ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. సంక్రాతి సందర్భంగా జనవరి 14న నుంచి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ‘డించక్‌.. డించక్‌...’ అంటూ సాగే ఐటమ్ ‌సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని యుగళగీతాన్ని మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

భార్యను చంపి.. మూట కట్టి

‘అల్లుడు అదుర్స్‌’ అనిపించుకుంటాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని