Akira Nandan: హీరోగా అకీరా నందన్‌.. రేణుదేశాయ్‌ క్లారిటీ

సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే వారికి పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ సుపరిచితుడే.

Published : 09 Apr 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే వారికి పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ సుపరిచితుడే. తన ప్రతభను మెచ్చుకుంటూ సంబంధిత వీడియోలను అకీరా తల్లి, దర్శక- నటి రేణుదేశాయ్‌ ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటారనే విషయం తెలిసిందే. శుక్రవారం అకీరా పుట్టిన రోజు సందర్భంగా బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ వీడియోను షేర్‌ చేశారు. 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘అకీరా.. కొడుకుగానే కాదు సోదరుడిగా, మిత్రుడిగా ఎంతో గొప్పవాడు. దయ, నిజాయతీ ఉన్నవాడు. అతనో జెంటిల్‌మ్యాన్‌’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు. అకీరాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్‌ చెప్పారు. ప్రస్తుతం.. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో అకీరాను కొనియాడారు. మరోవైపు, నటుడిగా మారేందుకే అకీరా బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాడని, త్వరలోనే హీరోగా మారుతున్నాడనే చర్చలు మొదలయ్యాయి. వీటిపై రేణు స్పందిస్తూ.. ‘‘అకీరాకు నటుడయ్యే ఉద్దేశం లేదు. అతను ఏ సినిమాకు సంతకం చేయలేదు. అకీరా తెరంగేట్రంపై వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని