Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు రేణు దేశాయ్‌ విషెస్‌.. పంచెకట్టులో అకీరా

పవన్‌ కల్యాణ్‌కు రేణు దేశాయ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెపంచకట్టులో వచ్చి ఆకట్టుకున్నారు.

Updated : 12 Jun 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేణూ దేశాయ్‌ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఇన్‌స్టాలో అకీరా, ఆద్య ఫొటోలను పంచుకున్న రేణూదేశాయ్‌ తనకు వీడియో కాల్‌ చేసినట్లు చెప్పారు. ‘వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలనుకొనే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవితో (Chiranjeevi) పాటు నాగబాబు, సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌ చరణ్‌, అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని