Repeat: నవలలో రాసినట్లే నిజ జీవితంలోనూ జరిగితే...!

నవీన్ చంద్ర, మధుబాల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రిపీట్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 28 Nov 2022 19:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నవీన్ చంద్ర, మధుబాల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రిపీట్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘రిపీట్‌ స్నీక్‌పీక్‌’ అంటూ 5నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఓటీటీ సంస్థ విడుదల చేసింది. ఇంతకీ కథేంటంటే: ఒక రచయిత రాసిన నవలలో మాదిరిగానే నేరాలు జరుగుతుంటాయి. తాను రాసినట్లే ఆ నేరాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని సదరు రచయిత పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే, ఆ రచయిత తాగి ఉన్నాడని భావించిన పోలీసులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో మరుసటి రోజు మరొక అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి డీజీపీ కుమార్తె కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారు. మరి పోలీస్‌ అధికారి అయిన నవీన్‌ చంద్ర ఈ కేసును ఎలా ఛేదించాడు. నేరస్థులను పట్టుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! అరవింద్ శ్రీనివాసన్ ఈ మూవీని తెరకెక్కించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని