Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు
ఎన్నో ఏళ్ల తమ ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకున్నారు క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), నటి అతియా శెట్టి (Athiya Shetty). ఇటీవల వివాహమైన ఈ జోడీకి బాలీవుడ్ తారలు విలువైన బహుమతులు పంపించినట్లు పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
ముంబయి: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), తన ప్రియురాలు, నటి అతియాశెట్టి (Athiya Shetty)ని మూడు రోజుల క్రితం వివాహ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నూతన జంటకు అభినందనలు తెలుపుతూ బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood), క్రికెటర్లు రూ. కోట్ల విలువైన బహుమతులు పంపించారని ఇటీవల పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆయా కథనాలపై తాజాగా సునీల్ శెట్టి (Suniel Shetty) బృందం స్పందించింది. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు తమని సంప్రదించాలని కోరింది.
రాహుల్ - అతియా కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో ఈ జోడీ జనవరి 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఈ కొత్త జంటకు రూ.1.64కోట్ల విలువ చేసే ఆడీ కారు గిఫ్ట్ ఇచ్చారని, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీ.. డైమండ్ హారం, బైక్, కారు బహుమతులుగా పంపించారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న సునీల్‌శెట్టి బృందం ఆయా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ వదంతులు మాత్రమేనని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
-
General News
TSRJC CET: మే 6న టీఎస్ఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల
-
India News
Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!
-
India News
Supreme court: ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం
-
World News
Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!
-
Sports News
Rohit Sharma: నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమానికి రోహిత్ శర్మ సరదా ప్రపోజల్