రివ్యూ: మిడిల్‌క్లాస్ మెలొడీస్
ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ చిత్రం ఎలా ఉందంటే..?
చిత్రం: మిడిల్‌క్లాస్ మెలొడీస్
తారాగణం: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, ప్రేమ్ సాగర్, ప్రభావతి వర్మ
సంగీతం: స్వీకార్ అగస్తీ, ఆర్‌హెచ్ విక్రమ్
ఛాయాగ్రహణం: సన్నీ కురపాటి
కళ: వివేక్ అన్నామళై
ఎడిటర్: రవితేజ గిరజాల
స్క్రీన్ ప్లే: జనార్దన్ పసుమర్తి, వినోద్ అనంతోజు
మాటలు, కథ, కథనం: జనార్దన్ పసుమర్తి
దర్శకత్వం : వినోద్ అనంతోజు
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్
విడుదల: 20/11/20 (అమెజాన్ ప్రైమ్)
మన తెలుగు సినిమాల్లో హీరో ఎక్కువగా మధ్య తరగతి యువకుడిగానే కనిపిస్తాడు. అయితే ఆలోచనలు, ఆశయాలు అంతకుమించి ఉంటాయి. వాటిని మనం తప్పు పట్టలేం కానీ... అలాంటి యువకుడు జీవితంలో ఏదో సాధించాలని అనుకోవడం, దాని కోసం తపన పడటం, గెలవడం అనేది ఎప్పుడూ ఆసక్తికర అంశమే. అలాంటి కథాంశంతో రూపొందిన సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ఆసక్తిరేకెత్తించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ రోజు ( 20/11/20)న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కథేంటంటే: గుంటూరులో హోటల్ పెట్టి వ్యాపారం చేయాలనేది రాఘవ(ఆనంద్ దేవరకొండ) ఆశయం. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈలోగా తండ్రి సొంతూరు కొలకలూరులో నడుపుతున్న హోటల్లో సాయంగా ఉంటుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి హోటల్ పెడతాడు. ఆ హోటల్ వ్యాపారం ఎలా సాగింది? ఈ క్రమంలో రాఘవ ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేది కథ. దీనికి అంతర్లీనంగా తన కాలేజీ నాటి ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనే ట్రాక్ సాగుతుంటుంది?. మరి ఈ హోటల్ ప్రేమకథలో రాఘవ ఏం చేశాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మధ్యతరగతి సినిమాలు, గ్రామీణ నేపథ్య సినిమాలు... టాలీవుడ్లో చిన్న సినిమాలకు ఈ రెండూ ఎప్పుడూ ఆకట్టుకునే అంశాలే. ఇలాంటి సినిమాల్లో ఉండే ఎమోషన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. తొలి సినిమాగా ఈ నేపథ్యాన్ని ఎంచుకుని వినోద్ అనంతోజు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కుర్రాడి ఆశయం, ప్రేమ మధ్య వచ్చే ఘర్షణ యువతకు కిక్ ఇస్తుంది. ఇందులో అదే చూపించారు. హోటల్ పెట్టి జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలనుకునే రాఘవ అనే కుర్రాడి కథే ఈ సినిమా. దాని కోసం అతడు ఎన్ని కష్టాలు పడ్డాడనేది ఒక ప్లాట్, ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడనేది ఇంకో ప్లాట్. ఈ రెండిటినీ జాగ్రత్తగా నడిపించాడు దర్శకుడు.
కీలక పాత్రల ఎంపిక విషయంలో పేరు మోసిన ఆర్టిస్ట్‌లను కాకుండా, నాటకాల అనుభవం, చిన్న చిన్న పాత్రలు చేసి పెద్దగా పేరు రానివారిని తీసుకుని సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తెలిసిన పాత కథే అయినా ఈ ఫ్రెష్ లుక్ చాలా పెద్ద మార్పు చూపించింది. గ్రామీణ నేపథ్యంలోని సన్నివేశాలు, తండ్రీ-కొడుకు మధ్య వచ్చిన సన్నివేశాలు సినిమాకు ప్రాణం. పెద్దగా ప్రేమ సన్నివేశాలు లేకపోవడంతో డ్యూయెట్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రేమకథలో డ్యూయెట్లు ఉంటే ఆ మజానే వేరు కదా.
ఎవరెలా చేశారంటే: మధ్యతరగతి యువకుడిగా ఆనంద్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ కుర్రాడికి ఉండే ఫ్రస్టేషన్, ఫన్ చక్కగా చూపించాడు. అయితే సంభాషణలు పలికే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రేమించిన వాడిని దక్కించుకునేందుకు తండ్రితో గొడవపడి, మానసికంగా నలిగిపోయే పాత్రలో కథానాయిక వర్ష బొల్లమ్మ కూడా చక్కగా నటించింది. ఎమోషన్స్‌ని కళ్లలో పలికించిన తీరు బాగుంది. సినిమాలో ఈ ఇద్దరి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర హీరో తండ్రిది. ఆ పాత్రలో గోపరాజు రమణ వావ్ అనిపించాడు. సినిమా సాంతం ఒకే ఎనర్జీతో కోపిష్ఠి తండ్రిగా సూపర్ అనిపించాడు. ఆనంద్ స్నేహితుడి పాత్రలో చైతన్య ఫుల్ లెంగ్త్ రోల్లో ఆకట్టుకున్నాడు. సురభి ప్రభావతి, ప్రేమ్‌సాగర్, ప్రభావతి వర్మ, దివ్య శ్రీపాద తమ పాత్ర మేరకు చక్కగా నటించారు.
మధ్యతరగతి నేపథ్యంలో సినిమా అంటే ఇల్లు, పరిసరాలు మాత్రమే చూపిస్తే చాలు అనుకుంటుంటారు. ఈ సినిమాలో దాంతోపాటు మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, నవ్వులు, సరదాలు, కోపాలు అన్నీ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మిడిల్‌క్లాస్ మెలొడీస్ పేరుకు తగ్గట్టే పేస్ట్‌కి రాయితో రుద్ది తీయడం, వాట్సాప్‌లో దేవుడి ఫొటో ఫార్వార్డ్ చేస్తే మంచిది అనుకోవడం, కాకా హోటల్లో పేపర్ చదువుతూ ముచ్చట్లు, స్థలాల అమ్మకాల వ్యవహారం, ఊళ్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి ఐపీ పెట్టి వెళ్లిపోవడం వంటి సన్ని వేశాలు చూపించాడు. పాటలన్నీ మాంటేజ్ స్టైల్లోనూ రూపొందించారు. అన్ని పాటలూ ఆకట్టుకున్నాయి.
‘నేల మీదకి రా, గాలిలో మేడలు కడితే లాభం లేదు’... అంటూ తను చేసిందే సూపర్ అనుకునే కుర్రాడి కళ్లు నేలకు దిగేలా హీరోయిన్ చెప్పే డైలాగ్ సినిమాకు కీలకం. తను చేసిన చట్నీతో దోశ తిన్నాక తండ్రి స్పందన కోసం ఎదురుచూసే సన్నివేశంలో ఆనంద్ చక్కగా నటించాడు. జనార్దన్ మాటలు బాగున్నాయి. చిన్న సినిమా అంటే పంచ్‌లు, ప్రాసలు కామన్‌గా ఉన్న ఈ రోజుల్లో అవేవీ లేకుండా రాసుకొచ్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రకరకాల పాత్రలను ఒకే సినిమాలో గుదిగుచ్చిన సందర్భాలు గతంలో చాలా చూశాం. ఈ సినిమా కూడా అలాంటిదే. వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఇందులో కనిపిస్తారు. అయితే కొత్తదనం ఆశించేవారు కాస్త నిరాశచెందే అవకాశమూ ఉంది.
బలాలు
+ కథ నేపథ్యం
+ పాత్రల చిత్రణ
+ వినోదం
బలహీనతలు
- కొత్తదనం లేకపోవడం
- తెలిసిన కథ
చివరిగా: ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’... బొంబాయి చట్నీ లాంటి సినిమా
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?