
RGV Unstoppable: బాలయ్య గారూ... ‘అన్‌స్టాపబుల్’కి నేనూ వస్తా!
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ టికెట్ ధరల అంశంతో పాటు ట్విటర్, యూట్యూబ్ ఇంటర్వ్యూలతో నెట్టింట హల్చల్ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకూ ఏ టాక్ షోకు ‘నన్ను పిలవండి’ అని అడగని ఆయన.. తొలిసారి ఓ టాక్ షోలో అవకాశమివ్వండంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ కార్యక్రమం ఓ రేంజ్లో ఉందని.. అందుకే ఆ షోలో పాల్గొని మాట్లాడాలనుకుంటున్నా అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ‘బాలయ్య గారు ఈ అవకాశాన్ని ఇస్తార’ని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటికే ఆర్జీవీ ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. దీని వెనుక గల కారణం తెలియాల్సి ఉంది. కాగా ఆర్జీవీ ట్వీట్‌ని డిలీట్ చేసే లోపే వైరల్ కావడంతో నెటిజన్లు ఒకే వేదికపై బాలయ్య, ఆర్జీవీ సంభాషిస్తే.. ఆ ఎపిసోడ్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.