RGV Unstoppable: బాలయ్య గారూ... ‘అన్‌స్టాపబుల్‌’కి నేనూ వస్తా!

ఏపీ టికెట్‌ ధరల అంశంతో పాటు ట్విటర్‌, యూట్యూబ్‌ ఇంటర్య్వూలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ. ఇప్పటి వరకూ ఏ టాక్‌ షోకు నన్ను పిలవండి అని అడగని ఆయన.. తొలిసారి ఓ టాక్‌ షోలో అవకాశమివ్వండంటూ ట్వీట్‌ చేశాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం ఓ రేంజ్‌లో ఉందని.

Published : 20 Jan 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ టికెట్‌ ధరల అంశంతో పాటు ట్విటర్‌, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ. ఇప్పటి వరకూ ఏ టాక్‌ షోకు ‘నన్ను పిలవండి’ అని అడగని ఆయన.. తొలిసారి ఓ టాక్‌ షోలో అవకాశమివ్వండంటూ ట్వీట్‌ చేశారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ కార్యక్రమం ఓ రేంజ్‌లో ఉందని.. అందుకే ఆ షోలో పాల్గొని మాట్లాడాలనుకుంటున్నా అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ‘బాలయ్య గారు ఈ అవకాశాన్ని ఇస్తార’ని ఆశిస్తున్నానని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటికే ఆర్జీవీ ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేశారు. దీని వెనుక గల కారణం తెలియాల్సి ఉంది. కాగా ఆర్జీవీ ట్వీట్‌ని డిలీట్‌ చేసే లోపే వైరల్‌ కావడంతో నెటిజన్లు ఒకే వేదికపై బాలయ్య, ఆర్జీవీ సంభాషిస్తే.. ఆ ఎపిసోడ్‌ కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు