RGV: ‘కేజీయఫ్‌-2’ రిలీజ్‌.. బాలీవుడ్‌పై వర్మ కామెంట్‌

బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌’. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌..

Published : 14 Apr 2022 14:43 IST

హిందీ చిత్రపరిశ్రమ ఏం ఆలోచిస్తుందో..!

హైదరాబాద్‌: బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్‌’. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘కేజీయఫ్‌-2’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. మథర్‌ సెంటిమెంట్‌, హీరో ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ‘కేజీయఫ్‌-2’లో ఎన్నో అంశాలు ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఉన్నాయని సినీ ప్రియులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కేజీయఫ్‌-2’ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌పై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన చిత్రాల జాబితా ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘‘బాలీవుడ్‌ మార్కెట్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాల్లో కన్నడ చిత్రమైన ‘కేజీయఫ్‌-2’, తెలుగు చిత్రమైన ‘బాహుబలి-2’ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీనిపై బాలీవుడ్‌ ఏం ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారు’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. వర్మ చేసిన ట్వీట్‌ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. మరోవైపు దక్షిణాది చిత్రాలకు ఇప్పుడు నార్త్‌లోనూ మంచి మార్కెట్‌ లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ తెలుగు చిత్రాలు హిందీలోనూ విడుదల అవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని