RGV: ‘కాంతార’ సక్సెస్‌.. వర్మ సూపర్‌ కామెంట్‌

కన్నడ చిత్రం ‘కాంతార’పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఈ సినిమా విజయాన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 17 Oct 2022 13:13 IST

హైదరాబాద్‌: కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార’ (Kantara). ప్రకృతి, సంస్కృతి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV) ఈ సినిమాపై తన స్పందన తెలియజేశారు.

‘‘సూపర్‌స్టార్స్‌, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌.. వంటివే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని సినిమా వాళ్లందరూ ఒక నిర్ణయానికి వచ్చిన వేళ.. ఎలాంటి అగ్ర తారాగణం లేకుండా తెరకెక్కిన చిన్న చిత్రం ‘కాంతార’ భారీ చిత్రాల రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్‌ చేసింది’’ అని వర్మ పేర్కొన్నారు. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కాంతార’ ఐఎండీబీ రేటింగ్‌లో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌-2’ వంటి అగ్రచిత్రాలను బీట్‌ చేసింది. ఐఎండీబీలో ‘కాంతార’కు 9.5 రేటింగ్‌ లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని