Published : 05 May 2022 10:50 IST

RGV: ‘కేజీయఫ్‌’ దర్శకుడిపై వర్మ కామెంట్స్‌

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మెప్పించి మోస్ట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రశాంత్‌ నీల్‌. ఇటీవల ‘కేజీయఫ్‌-2’ విజయంతో అన్ని చిత్రపరిశ్రమల వారు ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ప్రశాంత్‌నీల్‌ని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశారు. బుధవారం దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్మ కొన్ని ట్వీట్లు చేశారు. వీటిలో ప్రశాంత్‌నీల్‌ పనితనాన్ని మెచ్చుకున్నారు.

‘‘ప్రశాంత్‌నీల్‌.. నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్‌ లాంటివాడివి. ‘కేజీయఫ్‌’తో కన్నడ చిత్రపరిశ్రమతోపాటు కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఉన్న ప్రతి దర్శకుడి మనసును కొల్లగొట్టినందుకు ‘దర్శకుల దినోత్సవ’ శుభాకాంక్షలు. ‘కేజీయఫ్‌-2’ ఎందుకు అంత విజయం, క్రేజ్‌ సొంతం చేసుకుందో తెలియక చాలా మంది తమ సినిమాలను రీ షూట్‌, రీ డ్రాఫ్ట్‌, పునరాలోచన చేస్తూ టన్నుల కొద్దీ డబ్బును వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. చిత్రపరిశ్రమకు చెందిన 95 శాతం మంది సంప్రదాయమైన వారికి ‘కేజీయఫ్‌-2’ నచ్చలేదు. ప్రశాంత్‌ నీల్‌.. పాత సినీ పరిశ్రమను బయటకు నెట్టి.. కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశాడనటానికి ఇదే నిదర్శనం. ఆ కొత్త పరిశ్రమ పేరే కేజీయఫ్‌-2’’ అని వర్మ వివరించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని