RGV: గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి: రాంగోపాల్‌ వర్మ

మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారన్న విషయం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై....

Published : 19 Jan 2022 13:12 IST

హైదరాబాద్‌: మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారన్న విషయం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. గుడివాడ ఆధునీకీకరణకు పాటు పడుతున్న నానికి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. క్యాసినోకు వ్యతిరేకంగా వస్తోన్న  విమర్శలు పట్టించుకోవద్దని అన్నారు.

‘‘గుడివాడ ఆధునీకీకరణ అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న కొడాలి నానికి నా అభినందనలు. ఆయనకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. క్యాసినోకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. పారిస్‌, లాస్‌వెగాస్‌, లండన్‌ వంటి దేశాల జాబితాలో గుడివాడను ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నానిని మెచ్చుకోవాలి. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చిన నానిని విమర్శిస్తున్న వాళ్లు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.. గుడివాడ ప్రజలు గోవా వెళ్లగలరు కానీ గోవాలో నివసించేవాళ్లు గుడివాడ రారు.’’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు