RGV: పవన్‌కల్యాణ్‌ స్పీచ్‌పై వర్మ స్ట్రాంగ్ కామెంట్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన...

Updated : 24 Feb 2022 13:33 IST

అందుకే ఆయన్ని పవర్‌స్టార్‌ అనేది..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కీలకపాత్ర పోషించారు. శుక్రవారం ఉదయం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్రబృందం నిర్వహించింది. ఇందులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తిప్పని ఒక యుద్ధం ఈ సినిమా అని చాలా సింపుల్‌గా తేల్చేశారు. కాగా, పవన్‌ స్పీచ్‌పై తాజాగా రాంగోపాల్‌ వర్మ కామెంట్‌ చేశారు.

ట్విటర్‌ వేదికగా పవన్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘భీమ్లానాయక్‌’ ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ స్పీచ్‌ ఎంతో హూందాగా, అద్భుతంగా ఉంది. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉంది. అందుకే ఆయన్ని స్టార్స్‌ అందరిలోకెల్లా పవర్‌ఫుల్‌ అనేది’’ అని ట్వీట్‌ చేశారు. అనంతరం పవన్‌ స్పీచ్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘ఇప్పటి వరకూ పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన స్పీచ్చుల్లో ఇదే ది బెస్ట్‌. ఎంతో భావోద్వేగంగా, హృదయపూర్వకంగా, వినయంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని