RGV: చిన్న సినిమాలు ఆడాలి... ఏపీ ప్రభుత్వం ధరలు పెంచాలి: వర్మ

వాస్తవాలను అర్థవంతంగా చెప్పే వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. సినీ పరిశ్రమకి చెందిన విషయాలపైనే కాకుండా సమకాలిన అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. 

Published : 15 Jan 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవాలను అర్థవంతంగా చెప్పే వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. సినీ పరిశ్రమకు చెందిన విషయాలపైనే కాకుండా సమకాలిన అంశాలపై తనదైన శైలిలో అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు.  ఇటీవల ఏపీ సినిమా థియేటర్ల టిక్కెట్‌ ధరలపై పోరాటం చేసిన ఆయన.. భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పుడూ పండగలకు విషెస్‌ చెప్పడానికి ఇష్టపడని ఆర్జీవీ.. ఈసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

‘‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని ఆర్జీవీ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. ఇక ఏపీ థియేటర్ల టికెట్ల అంశంపై మాట్లాడిన ఆయన.. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది ఫిల్మ్‌ ఇండస్ట్రీ సమస్య కాదని.. తన ఇగో ఇష్యూ అంటూ వ్యాఖ్యానించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని