RGV: ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే?

‘‘ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రం ‘డేంజరస్‌’. నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ చిత్రం’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమే ‘డేంజరస్‌’.

Updated : 20 Nov 2022 09:22 IST

‘‘ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రం ‘డేంజరస్‌’ (Dangerous). నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ చిత్రం’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ (RGV). ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమే ‘డేంజరస్‌’. నైనా గంగూలి, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌పాల్‌ యాదవ్‌, మిథున్‌ పురంధర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘‘హీరో.. హీరోయిన్ల నేపథ్యంలో వేలాది సినిమాలొచ్చాయి. వాటికి భిన్నంగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో దీన్ని మలిచాం. మగవాళ్లతో వాళ్లిద్దరూ ఎలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారన్నది ఆసక్తికరం. రొమాన్స్‌, క్రైమ్‌, యాక్షన్‌, సస్పెన్స్‌.. ఇలా అన్ని అంశాలు నిండిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నాకు, వర్మకు మధ్య ఉన్న అరమరికలు అన్నీ తొలగిపోయాయి. ఇకపై ఇద్దరం కలిసి సినిమాలు విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత నట్టి కుమార్‌. సంగీతం: ఆనంద్‌, ఛాయాగ్రహణం: మల్హర్‌ భట్‌ జోషి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు