Updated : 20 Jul 2022 14:51 IST

RGV: సినీ నిర్మాత శేఖర్‌రాజుపై పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

పంజాగుట్ట: సినీ నిర్మాత శేఖర్‌రాజుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘లడ్కీ: ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌ ’ సినిమాను నిలుపుదల చేశారంటూ పంజాగుట్ట సీఐ హరీశ్‌ చంద్రారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ శేఖర్‌రాజు తనకు నగదు ఇవ్వాలని.. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్‌ కోర్టులో ఆయన కేసు వేశారని ఆరోపించారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతో సినిమా నిలుపుదల చేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. సినిమాపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. నిర్మాత శేఖర్‌రాజుకు తాను నగదు ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆర్జీవీ తెలిపారు.

‘‘సినిమా అనేది నటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా  ఎంతోమందికి సంబంధించిన విషయం. అలాంటిది ఒకరిద్దరి మధ్య ఉన్న చోటుచేసుకునే విభేదాల వల్ల చివరి నిమిషంలో సినిమాను ఆపడం మంచి పద్ధతి కాదు. దీన్ని ఇండస్ట్రీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేనిక్కడికి వచ్చా. నేనే కాదు ఈ సినిమా విషయంలో నష్టపోయిన వారందరం కేసులు పెట్టబోతున్నాం. అక్రమ పద్ధతుల్లో ఇలాంటి పనులు చేసే ఎన్‌.రవికుమార్‌రెడ్డి, శేఖర్‌రాజులాంటి వారికి ఇదొక గుణపాఠం కావాలి’’ అని ఆర్జీవీ అన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని