RGV: వాటి ధరల్నీ ప్రభుత్వం నిర్ణయించదు: రామ్‌గోపాల్‌ వర్మ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల విషయంపై గత కొన్నిరోజుల నుంచి వరుస ట్వీట్లు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా మరోసారి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. సినిమాల మాదిరిగానే థీమ్‌.....

Published : 08 Jan 2022 12:32 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల విషయంపై గత కొన్నిరోజుల నుంచి వరుస ట్వీట్లు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా మరోసారి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. సినిమాల మాదిరిగానే థీమ్‌ పార్కుల ధరలూ ప్రభుత్వం నిర్ణయించలేదని ఆయన అన్నారు. ఈమేరకు శనివారం ఉదయం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సినిమా మాదిరిగానే థీమ్‌ పార్కులు, మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌, మ్యాజిక్‌ షోలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ కిందకే వస్తాయి. వీటి ధరల్ని కూడా ప్రభుత్వం నిర్ణయించదు’’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

మరోవైపు సినిమా టికెట్‌ ధరల తగ్గింపు విషయంపై ఏపీ ప్రభుత్వం, రామ్‌గోపాల్‌ వర్మల మధ్య ట్విటర్‌ వార్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టికెట్‌ ధరల విషయంపై చర్చకు తాను సిద్ధమని వర్మ తెలపడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. ఆయన్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు 10వ తేదీన మంత్రితో వర్మ భేటీ కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు