RGV: ‘శివ’... అలా కాపీ కొట్టి తీశా!

‘‘టికెట్‌కి డబ్బు సరిగ్గా దొరకని పరిస్థితుల్లో సైకిల్‌పై వెళ్లి ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ చూసేవాణ్ని. అప్పట్నుంచి బ్రూస్‌లీ ప్రభావం నాపై బలంగా పడింది. నా ‘శివ’ సినిమా ఆయన ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ నుంచి కాపీ కొట్టి తీసిందే.  బ్రూస్‌లీ తనకంటే బలమైన వ్యక్తుల్ని

Updated : 13 Jul 2022 12:33 IST

‘‘టికెట్‌కి డబ్బు సరిగ్గా దొరకని పరిస్థితుల్లో సైకిల్‌పై వెళ్లి ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ (Enter The Dragon) చూసేవాణ్ని. అప్పట్నుంచి బ్రూస్‌లీ(Bruce Lee) ప్రభావం నాపై బలంగా పడింది. నా ‘శివ’ (Shiva) సినిమా ఆయన ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’(Return Of The Dragon) నుంచి కాపీ కొట్టి తీసిందే.  బ్రూస్‌లీ తనకంటే బలమైన వ్యక్తుల్ని సహజంగా కొట్టడాన్ని తెరపై చూసి ఆశ్చర్యపోయేవాళ్లం. అలా ఓ అమ్మాయి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిందే మా చిత్రం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(RamGopal Varma). మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రంగా తెరకెక్కించిన సినిమా ‘అమ్మాయి’ (Ammayi). పూజా భలేకర్‌ (Pooja Bhalekar) ప్రధాన పాత్రధారి. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ  సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.  
* ‘‘జెట్‌లీ, టోనీజా తదితరుల్ని తెరపై చూస్తున్నప్పుడు బ్రూస్‌లీని ఎంతగా మిస్‌ అవుతున్నానో అర్థమయ్యేది. బ్రూస్‌లీ చనిపోయిన 40 ఏళ్ల తర్వాతా ఆయన తరహా సినిమాలు ఎందుకు రావడం లేదా అనిపించేది. నేను మార్షల్‌ ఆర్టిస్ట్‌ని కాదు కానీ, ఆ కళల్ని బాగా అధ్యయనం చేశా. ఆ  నేపథ్యంలో ‘అమ్మాయి’ సినిమాని తీశా.  ఇందులో మార్షల్‌ ఆర్ట్స్‌తోపాటు, ఓ ప్రేమకథ ఉంటుంది’’.
* ‘‘ఈ కథ చెప్పాలనుకున్నాక కోల్‌కతా, చెన్నైతోపాటు పలు  నగరాలు తిరిగి మార్షల్‌ ఆర్టిస్ట్‌ కోసం అన్వేషణ జరిపాం. కొద్దిమంది దొరికినా వాళ్లు దాదాపుగా అబ్బాయిల్లాగే కపిపించారు. దాంతో ఈ కథని కొన్నాళ్లు పక్కనపెట్టా. అనుకోకుండా ఒక వ్యక్తి పూజా భలేకర్‌ గురించి చెప్పారు.  ఈ కథకి తగ్గ నటి అని ఆమెని ఎంపిక చేశా’’.
‘‘తదుపరి ఆల్‌ఖైదా ఉగ్రవాది, 9/11 దాడుల రింగ్‌ లీడర్‌ మహమ్మద్‌ అట్ట జీవితం నేపథ్యంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నా. అమెరికాలోనే ఇంగ్లిష్‌, అరబిక్‌ భాషల్లో ఆ సినిమా తీస్తున్నా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని