RGV: బాలీవుడ్‌పై వర్మ షాకింగ్‌ కామెంట్స్

అంశమేదైనా సరే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘కేజీయఫ్‌-2’ చిత్రాలు విడుదలైన నాటి నుంచి ఆయన బాలీవుడ్‌పై వరుస కామెంట్స్‌ చేస్తోన్న...

Published : 13 May 2022 13:18 IST

ఇకపై ఓటీటీ కోసమే సినిమాలు

హైదరాబాద్‌: అంశమేదైనా సరే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’, ‘కేజీయఫ్‌-2’ చిత్రాలు విడుదలైన నాటి నుంచి ఆయన బాలీవుడ్‌పై వరుస కామెంట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రాల విజయాలతో బాలీవుడ్‌ వాళ్లకి పీడకలలు తప్పవని, ఇకపై రీమేక్స్‌ కాకుండా మంచి కంటెంట్‌ని నమ్ముకోవాలని ఇటీవల వ్యాఖ్యలు చేసిన వర్మ తాజాగా మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘థియేటర్లలో దక్షిణాది చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే.. త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయి’’ అని వర్మ అన్నారు జాతీయ భాష విషయంలో ఇటీవల సుదీప్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ల మధ్య జరిగిన ట్వీట్స్‌ వార్‌, బాలీవుడ్‌ ఎంట్రీపై మహేశ్‌ బాబు చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారిన వేళ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని