Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌పై వర్మ కామెంట్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ మరో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళీ సూపర్‌హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా సిద్ధమవుతోన్....

Published : 17 Feb 2022 10:39 IST

బన్నీ కంటే తానే పెద్ద అని పవన్ నిరూపించుకోవచ్చు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌.. ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌లో కనిపించడం, ఆయనకు ప్రత్యర్థిగా రానా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల తెలుగు చిత్రాలకు బాలీవుడ్‌ మార్కెట్‌లోనూ మంచి లాభాలు వస్తున్న కారణంగా ‘భీమ్లానాయక్’ని తెలుగు-హిందీ భాషల్లో ఫిబ్రవరి 25న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ నిర్ణయించింది.

కాగా, ‘భీమ్లానాయక్‌’ హిందీ రిలీజ్‌పై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. పవన్‌ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్‌ చేయడం తనకెంతో ఆనందంగా ఉందంటూ కామెంట్‌ చేశారు. ‘‘గ్రేట్‌.. ‘భీమ్లానాయక్‌’ హిందీలోనూ రిలీజ్‌ అవుతోంది. ‘పుష్ప’ కంటే ‘భీమ్లానాయక్‌’ పెద్ద చిత్రమని.. బన్నీ కంటే తాను పెద్ద వాడిని.. ఈ విధంగా నిరూపించుకునే అవకాశం పవన్‌కల్యాణ్‌ వచ్చింది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. మరోవైపు, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ గతేడాది ఆఖర్లో విడుదలై కేవలం బాలీవుడ్‌లోనే 100 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని