RGV: సినిమా టికెట్ల అంశం.. మరోసారి స్పందించిన ఆర్జీవీ

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు.

Updated : 11 Jan 2022 11:59 IST

హైదరాబాద్‌: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సినిమా టికెట్ల అంశంపై ఇటీవల ఏపీ మంత్రి పేర్నినాని, ఆర్జీవీ మధ్య ట్వీట్ల వార్‌ జరిగింది. ఈ క్రమంలో మంత్రిని ఆర్జీవీ సోమవారం కలిశారు. టికెట్‌ ధరల అంశంపై పేర్ని నానితో ఆయన చర్చించారు. సమావేశం అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ తయారీదారులుగా సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని, దాన్ని ఇంకొకరు తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వానికి టికెట్ల ధరల నిర్ణయంలో ఎలాంటి హక్కు లేదని, తయారీదారులపై ఒత్తిడి తెచ్చి తక్కువ ధరకు విక్రయించేలా చేయడాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశారు. సినిమాను రూ.300 కోట్లు పెట్టి తీసిన నిర్మాతలు దానికి అనుగుణంగా టికెట్‌ ధర ఎంత ఉండాలనేది నిర్ణయించే వీలుండాలని, ఇక్కడ జరిగే నగదు కార్యకలాపాల పారదర్శకత ఒక్కటే ప్రభుత్వానికి ముఖ్యమనేది తన అభిప్రాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తాజాగా టికెట్ల ధరపై మళ్లీ ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని